మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేరుస్తాం : కేటీఆర్‌

-

కేసీఆర్‌కు కామారెడ్డిలో దమ్ము చూపి.. దుమ్మురేపే రీతిలో భారీ మెజారిటీ ఇవ్వాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. కామారెడ్డి రూరల్, పట్టణ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టుబట్టి మరి సీఎంను ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఒప్పించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహరంగసభలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణలోని ప్రతి వ్యక్తికి కేసీఆర్‌ బీమా సౌకర్యం కల్పించబోతున్నాం. పద్దెనిమిదేళ్లు పైబడిన అర్హురాలైన ప్రతి ఆడబిడ్డకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3000 భృతి చెల్లించనున్నాం. ఇవన్నీ మ్యానిఫెస్టోలో చేర్చాం. గతంలో మ్యానిఫెస్టోలో చేర్చని పనులు కూడా చేశాం. ఇప్పుడు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తాం. ఎమ్మెల్యే గోవర్ధన్‌ అన్నతో కలిసి మీరంతా నియోజకవర్గంలోని వివిధ సంఘాలను కలుపుకుని పోవాలి. అందరి మద్దతు కూడగట్టి కేసీఆర్‌ను బంపర్‌ మెజారిటీతో గెలిపించాలి. కామారెడ్డిలో కేసీఆర్‌ గెలుపు ఖాయం. కానీ బంపర్‌ మెజారిటీతో గెలిచిపించడం ముఖ్యం’ అని మంత్రి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version