బీఆర్‌ఎస్‌ పార్టీ 60 లక్షల సైన్యం ఉన్న పార్టీ : కేటీఆర్‌

-

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అని, కార్యకర్తల భరోసా కోసం అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం నాడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్థలం ఇచ్చారని, అప్పటి ప్రభుత్వానికి నచ్చకపోవడంతో తమను ఖాళీ చేయించిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నేతలది మాత్రమే కాదని, ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్తదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ 60 లక్షల సైన్యం ఉన్న పార్టీ అని, గులాబీ జెండా అంటే పేదల జెండా అని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్‌. కార్యకర్తల ఇంట్లో శుభకార్యాలు ఉంటే పార్టీ కార్యాలయాన్ని తక్కువ ఖర్చుతో ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్‌. కార్యకర్తలు ఎప్పుడు సిరిసిల్లకు వచ్చినా బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో చాయ్ తాగి వెళ్లాలని మంత్రి సూచించారు. ప్రజావాణిలో ధరకాస్తులు ఇచ్చే వారు బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇచ్చినా తీసుకొని సమస్యలు పరిష్కరించాలన్నారు.

కార్యాలయంలో నాయకులు ప్రతి రోజు ప్రెస్ మీట్‌లు పెట్టాలని, అవతలి పార్టీ వాళ్లు ప్రెస్‌ మీట్‌ పెట్టి తిడితే వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి కౌంటర్ ఇవ్వాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్, బీజేపీ బాస్‌లు ఢిల్లీలో ఉంటారని,
మన బాస్ లు గల్లీలో ఉంటారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో చూసి కాంగ్రెస్, బీజేపీ దుప్పటి కప్పుకున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లకే ఓట్లు వస్తాయని, కేసీఆర్‌ను తిడితే రావని మంత్రి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version