పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక అద్భుతం : కేటీఆర్

-

హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. మౌలిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మించారని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శమని తెలియజేశారు.

రాష్ట్రం కోసం నిజంగా ఇదొక అద్భుతమని కొనియాడారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు సీఎం చేతుల మీదుగా అంకితం చేస్తున్నామని స్పష్టం చేశారు. డ్రోన్ టెక్నాలజీ సాయంతో చిత్రీకరించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ వీడియో దృశ్యాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

 

 

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం.. కమాండ్‌ కంట్రోల్‌ నమూనాను పరిశీలించారు. కేంద్రంలో మంత్రులు, అధికారులతో కలిసి కలియ తిరిగారు.

అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలు ఏర్పాటు చేశారు. టవర్-ఏలో 20 అంతస్థులు నిర్మించారు. ఇందులోని నాలుగో అంతస్థులో డీజీపీ ఛాంబర్, ఏడో అంతస్థులో సీఎం, సీఎస్​ ఛాంబర్లు ఉన్నాయి. 18వ అంతస్థులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version