ఆ మంత్రిని టెన్షన్ పెడుతున్న కమలం?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని బీజేపీ బాగా టెన్షన్ పెడుతుందనే చెప్పాలి…మూడోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కారు పార్టీని కమలం షేక్ చేస్తుంది. ఊహించని విధంగా బలం పుంజుకుని, టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే స్థాయికి బీజేపీ వచ్చేసింది…ఇప్పటికే పలు స్థానాల్లో బీజేపీ బలం పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఎక్కడకక్కడ కమలంతో ఎక్కడ ఇబ్బంది వస్తుందా? అని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బాగా టెన్షన్ పడుతున్నారు.

ఇక వీరిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో కొందరు మంత్రులకు కమలం చేతులో పరాభవం తప్పేలా లేదు. ఇదే క్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సైతం కమలం పార్టీతో టెన్షన్ పెరిగిందట. ఎప్పుడైతే నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీ పుంజుకోవడం మొదలైందో…అప్పటినుంచి అక్కడ ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశాంత్ రెడ్డికి సైతం కమలంతో రిస్క్ ఎక్కువ ఉంది.

2014లో భారీ మెజారిటీతో బాల్కొండ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన ప్రశాంత్…2018 ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం కొట్టేశారు. ఇక మంత్రిగా ప్రశాంత్ రెడ్డికి కంటూ సెపరేట్ ముద్ర ఏమి పడలేదు…కేసీఆర్ చెప్పింది చేయడమే ప్రశాంత్ పని అన్నట్లు ఉంది.

ఇక బాల్కొండలో అభివృద్ధి విషయంలో ప్రశాంత్ గొప్పగా చేసిన కార్యక్రమాలు పెద్దగా లేవని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో బాల్కొండలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

కానీ ఏడాది గ్యాప్ లోనే జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బాల్కొండలో బీజేపీకి మెజారిటీ వచ్చింది…అప్పటినుంచి బాల్కొండలో ప్రశాంత్ రెడ్డికి చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. నెక్స్ట్ అక్కడ బలమైన అభ్యర్ధిని పెట్టి ప్రశాంత్ రెడ్డికి చెక్ పెట్టాలని కమలం చూస్తుంది. మొత్తానికైతే కమలం పార్టీ మంత్రిని బాగానే టెన్షన్ పెడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version