పార్టీ నేతలకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు

-

బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలు,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో సోమవారం మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. అకాల వర్షాలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని పార్టీ నేతలకు సూచించారు. అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని వారితో అన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. ఉపాధి హామీ, పట్టణ, పల్లె ప్రగతి వంటి అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపు పై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో పనులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వచ్చేనెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన 1300 కోట్లు కేంద్రం పెండింగ్ లో పెట్టడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version