తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వసూళ్ల దందా తీవ్ర దుమారం రేపుతోంది. ఓ వెంచర్ విషయంలో మాల్లారెడ్డి రియల్టర్ కి వార్నింగ్ ఇచ్చారు. వెంచర్ వేసినందుకు తనకు మాముళ్లు ఎందుకు ఇవ్వలేదంటు బెదిరించారు. 50 ఎకరాల స్థలంలో వెంచర్ వేసిన తర్వాత కలవాలని తెలీదా అంటూ మహేందర్ అనే రియల్టర్‌ను ఫోన్ చేసి మంత్రి మల్లారెడ్డి బెదిరించారు.
సర్పంచ్ కి మాముళ్లు ఇచ్చానని చెప్పాడు సదర్ రియల్టర్. సర్పంచ్ కి ఇస్తే సరిపోదని తనకు లోకల్ ఎమ్మెల్యేకి మాముళ్లు ఇవాల్సిందే అన్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గపరిధిలో 50 ఎకరాల వెంచర్ కు సంబంధించిన విషయంలో రియల్టర్ కి వార్నింగ్ ఇచ్చాడు. నన్ను కలిసి డబ్బులు ఇచ్చేదాకా వెంచర్ పనులు ఆపేయాలని హెచ్చరించారు. మల్లారెడ్డి వసూళ్ల దందా ఆడియో టేప్ ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. మల్లారెడ్డి మీద గతంలోనూ భూ ఆక్రమణ కేసు నమోదైంది. మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కుమారుడు సురారంలో మల్లారెడ్డికి చెందిన ఆస్పత్రికి అనుకొని ఉన్న 20 గుంటల భూమిని కబ్జా చేశారని శ్యామల దేవి అనే మహిళ ఫిర్యాదు చేశారు.