Kajal Agarwal : బాలీవుడ్​పై చందమామ బ్యూటీ సంచలన కామెంట్స్

-

టాలీవుడ్ చందమామ.. అదేనండి కాజల్ అగర్వాల్ బాలీవుడ్​లో పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ బ్యూటీకి అక్కడ నిరాశే ఎదురైంది. దక్షిణాదిలో మాత్రం ఈ భామ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయితే తాజాగా కాజల్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాజల్‌ ‘దక్షిణాది సినిమాలు వర్సెస్‌ బాలీవుడ్‌’ అనే అంశంపై స్పందించింది.

‘‘’నేను ముంబయి అమ్మాయిని. పుట్టి, పెరిగిందంతా ఇక్కడే. అయితే.. నా కెరీర్‌ మొదలైంది హైదరాబాద్‌లో. తమిళం, తెలుగు సినిమాల్లోనే నేను ఎక్కువగా పనిచేశాను. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్‌, చెన్నై నగరాలనే నివాసంగా భావిస్తుంటా. అది ఎప్పటికీ మారదు. దక్షిణాది చిత్రపరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. టాలెంట్‌ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. హిందీ మా మాతృభాష. బాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పెరిగాం. బీటౌన్‌లోనూ నేను మంచి సినిమాల్లో నటించా. కానీ, దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్‌లో లోపించాయని నేను భావిస్తున్నా’’’ అని కాజల్‌ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version