‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభకు ముందు టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు అయింది. నేపాల్ లో నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు నారా లోకేష్ వెళతారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారు నారా లోకేష్. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు మంత్రి నారా లోకేష్. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్…’సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభకు దూరం కానున్నారు.