ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. దసరా సెలవులలో మార్పులు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు చేయాలని తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ గోపికృష్ణ విజ్ఞప్తి చేయడం జరిగింది.

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యాసంస్థలకు ఈనెల 24వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. అయితే పండుగ ఈ నెల 22 వ తేదీ నుంచి మొదలవుతుందని… ఈ తరుణంలో ఆ తేదీ నుంచే సెలవులు ఇవ్వాలని తాజాగా ఏపీ సర్కార్ను కోరారు ఎమ్మెల్సీ గోపికృష్ణ.
డీఎస్సీ నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 21వ తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు స్కూళ్లకు హాలిడేస్ ఉన్నాయి.