నేటి నుంచి ఏపీ మంత్రి నారా లోకేశ్ లండన్ పర్యటించనుంది. నవంబర్ 14, 15 తేదీల్లో వైజాగ్‌లో జరిగే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించిన అధ్యయనానికి నారా లోకేశ్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ లండన్ పర్యటించారు. విద్య, ఆరోగ్యం, ఫార్మా రంగాలపై ప్రధానంగా అధ్యయనం చేయనున్నారు.
ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సైతం చర్చలు జరుపనున్నారు నారా లోకేష్. ఇది ఇలా ఉండగా…. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. 24న సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, దర్శించుకుంటారు. ఇటు 28వ తేదీన రాత్రి 7 గంటలకు జరిగే గరుడవాహన సేవను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.