తెలుగుదేశం కార్యకర్తలు, అనుచరులకు మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తి చేశారు. కొన్ని అనివార్య కారణాల వలన డా.పొంగూరు నారాయణ సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ నిలిపివేయబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల సమాచారానికి సంబంధించి ఈ కొత్త అధికారిక అకౌంట్‌ను ఫాలో అవ్వాలని ఆయన విన్నవించారు.
ఇదిలాఉండగా, మంత్రి నారాయణ ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులుగా కొనసాగుతున్నారు. ఆయన సోషల్ మీడియా ఖాతా కొంతకాలంగా ఇనాక్టివ్‌లో ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన కొత్త అకౌంట్ ఓపెన్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు ఫాలో అవ్వాలని కోరారు.
తెలుగుదేశం కార్యకర్తలకు మరియు అనుచరులకు నమస్కారం!
కొన్ని అనివార్య కారణాల వల్ల డా.పొంగూరు నారాయణ గారి ట్విట్టర్ (X) అకౌంట్ నిలిపివేయబడింది. ఆంధ్రప్రదేశ్ మరియు నెల్లూరు నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల సమాచారానికి ఈ కొత్త అధికారిక అకౌంట్‌ను ఫాలో అవ్వగలరు. pic.twitter.com/7foeLVZtYH
— Ponguru Narayana (@Dr_NarayanaP) December 3, 2024