ఏపీ ఇరిగేషన్ ఎన్జీవోస్ అసోసియేషన్ డైరీను ఆవిష్కరించారు మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్. ఈ సందర్భంగా మంత్రు నిమ్మల కీలక కామెంట్స్ చేసారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ళ పాలనలో ఇరిగేషన్ శాఖతో పాటు అన్ని వ్యవస్ధలనూ భ్రష్టుపట్టించారు. ఏపీ లో ఏ ముఖ్యమంత్రి చేయని విధ్వంసం గత ఐదేళ్లలో జరిగింది. డ్రెయిన్స్, గేట్లు, షట్టర్లు, లాక్స్, రోప్స్ కు గ్రీజు వంటి కనీస మైంటనేన్స్ కూడా చేయలేదు.
అయితే గత పాలనలో జరిగిన నష్టాలు పూడ్చడానికి మంత్రులం గానీ, ఉద్యోగులు గానీ డబుల్ వర్క్ చేయాల్సి వస్తోంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒకటి రెండు సంవత్సరాల్లో హంద్రీనీవా, వెలిగొండ, చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే శక్తి ఇరిగేషన్ శాఖకే ఉంది అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.