ఆయిల్ పామ్, పత్తి సాగు పెంచాలని కోరుతున్నాం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మంగళవారం వరంగల్‌లో రాబోయే సీజన్‌ గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుకు భీమా అందించే రైతుభీమా పథకం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. రైతుకు రైతుబంధు పథకం ద్వారా ఎదురు పెట్టుబడి ఇస్తున్నది కేసీఆర్ మాత్రమేనని, ఏది పండించాలి ? ఏది పండించకూడదు ? అని తెలుసుకుని సాగు చేస్తే అది లాభసాటి వ్యవసాయం అవుతుందని నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు.

5 శాతం మాత్రమే జీవరాశి జీవించగలిగే ఈజిప్ట్ లో కోటి ఎకరాలలో భూమి మాత్రమే సాగవుతుందన్న మంత్రి.. అక్కడ గోధుమ ప్రధానపంట .. అక్కడ ప్రభుత్వమే ఏ పంటలు పండించాలో రైతులకు నిర్దేశించిన ప్రకారమే వారు పంటలు పండిస్తున్నారని ఆయన తెలిపారు. మురుగునీటిని శుద్దిచేసి ద్రాక్ష, పుచ్చకాయలు వంటి పండ్లు, కూరగాయల పంటలు పండిస్తున్నారు .. మొన్నటి వరకు ఇతర దేశాల మీద ఆధారపడిన ఈజిప్ట్ నేడు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తోందన్నారు. మన దేశంలో గోధుమల ఎగుమతిని ప్రధాని మోడీ నిలిపివేశారని, చిన్న, చిన్న దేశాలు ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంటే .. దాదాపు 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్న మన దేశం ఎగుమతులను నిషేధించడం గమనార్హమన్నారు. తెలంగాణ భూములలో భాస్వరం స్థాయి అవసరానికి మించి ఉన్నది .. దానిని సరిచేసేందుకు పాస్ఫేట్ వినియోగించడం జరుగుతున్నదని, పంటల ఉత్పాదకతను పెంచలేక అంతర్జాతీయ మార్కెట్ లో మన వ్యవసాయ ఉత్పత్తులు అమ్మే పరిస్థితి లేక కేంద్రం ఎగుమతులపై చేతులు ఎత్తేస్తుందన్నారు.

విద్యుత్‌, నీళ్లు, రైతుబంధు, రైతుభీమా పథకాలు ఇచ్చి కూడా తెలంగాణ రైతులు నష్టపోవద్దని జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ పరిశీలించి ఏ పంటలు వేయాలో సలహా ఇచ్చేందుకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ కేసీఆర్ ఏర్పాటు చేశారని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో కందులు, ఆయిల్ పామ్, పత్తి సాగు పెంచాలని కోరుతున్నామని, ఆయిల్ పామ్ సాగు విషయంలో రైతులను చైతన్యం చేయడంలో విజయవంతమయ్యామన్నారు. ఉద్యాన, కాయగూరల్లో విభిన్న పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని, అంతర్జాతీయంగా డిమాండ్ తోతాపురి మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, అరటి సాగు వైపు ఉద్యానశాఖ రైతులను ప్రోత్సహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version