మహారాష్ట్రలోని థానే కేపీఆర్ డిగ్రీ కళాశాల, బోరేవళి నలంద అకాడమీలో నిర్వహించిన వనపర్తి నియోజకవర్గ గిరిజన సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తండాలలో గిరిజనుల ఆర్థిక శక్తి పెరిగింది. రైతుబంధు, రైతు బీమా, సాగునీళ్లు, ఉచిత కరంటు పథకాలతో వ్యవసాయం బలపడిందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన పనులు వంద ఉన్నాయని, ప్రధాని మోదీ చేసిన పని ఒక్కటి అయినా చూపించగలరా ? అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు మంత్రి నిరంజన్ రెడ్డి. ముంబైలో ఉంటున్న మీకు మీ పక్కింట్లో తెలంగాణ మాదిరిగా ఎవరికన్నా కల్యాణలక్ష్మి, వృద్ధ్యాప్య ఫించన్లు వస్తున్నాయా ? కేసీఅర్ కిట్ అమ్మవడి పథకాలు అందుతున్నాయా ? రైతుబంధు,రైతుబీమా పథకాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇలాంటివి ఏవి ఇవ్వనోళ్లు ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో వలసొచ్చిన మీరు వెనక్కు వస్తారని హామీ ఇచ్చానని, సాగునీళ్లు వస్తాయని, సంక్షేమ పథకాలు అందుతాయి అని చెప్పానన్నారు నిరంజన్ రెడ్డి. పొట్ట చేత పట్టుకుని మీరు వలస వెళ్లవద్దే పరిస్థితి ఉండొద్దని అన్నానని, నాడు నేను చెప్పిన ప్రకారం 70 శాతం హామీ నెరవేరిందన్నారు నిరంజన్ రెడ్డి. నేడు మిమ్మల్ని కలుసుకోవడం కడుపు నిండినట్లుందని, తండాలలో అన్ని వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు నిరంజన్ రెడ్డి. గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు నిరంజన్ రెడ్డి.