మత్స్యకారులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం..

-

మత్స్యకారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు.ఈనెల 3వ తేదీ నుంచి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో రాష్ట్ర మత్యశాఖ తరపున చేపల పంపిణీ చేపడతామని అన్నారు. జిల్లాలోని మంత్రులు, విప్‌లు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కార్పోరేషన్ చైర్మన్‌లు, ప్రభుత్వ సలహాదారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి సూచించారు.మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపేందుకు సీఎం రేవంత్ సారధ్యంలో ప్రజాపాలనాను ప్రభుత్వం నిర్వహిస్తోందని, అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని చెరువులు,ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురిపిస్తుందని మంత్రి పొన్నం ఆశాభావం వ్యక్తం చేశారు.చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్‌తో పాటు,డైరెక్టర్ ప్రియాంకలకు తగు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version