ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..కారణం ఇదే

-

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ను పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని ఖత్వా బహిరంగ సభలో ప్రసంగిస్తూ అస్వస్థకు గురైన ఖర్గే…ప్రస్థుతం ఆస్పత్రిలోనే ఉన్నారు.

Telangana CM Revanth Reddy is busy during his visit to Delhi

బీపీ ఎక్కువ అవ్వడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలిపిన డాక్టర్లు…రెస్ట్ తీసుకోవాలని పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించునున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖర్గేతో పాటు పార్టీ అగ్ర నేతలను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. అటు హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. రేపు హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు మల్లికార్జున ఖర్గే.

Read more RELATED
Recommended to you

Exit mobile version