సబర్మతి నదిని పరిశీలించిన మంత్రి పొన్నం, టీపీసీసీ చీఫ్

-

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ చింతన్ శివిర్‌లో పాల్గొనేందుకు వెళ్లిన కాంగ్రెస్ మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఇతర సీనియర్ నేతలు ప్రస్తుతం అక్కడి టూరిస్టు ప్రాంతాలను వీక్షిస్తున్నారు.

ఈ క్రమంలోనే గుజరాత్‌లోని సబర్మతి నదిని మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు.సబర్మతి నది మాదిరి మూసీ అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో చర్చించారు. త్వరలో జీహెచ్ఎంసీ మేయర్, 150 మంది కార్పొరేటర్లు సబర్మతి స్టడీ టూర్‌కు వెళ్లనున్నారు.ఫేజ్-1లో బాపు ఘాట్ వరకు అభివృద్ధిని జీహెచ్ఎంసీ బృందం పరిశీలించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news