నాగబాబుకు మంత్రి రోజా కౌంటర్

-

ఏపీలో రాజకీయాలు హిట్ ఎక్కాయి. మంత్రి రోజా – మెగా బ్రదర్ నాగబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ట్విట్టర్ వేదికగా ఏపీ మంత్రికి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారతదేశ పర్యటకశాఖ ర్యాంకింగ్స్లో 20 స్థానాలలో మొదటి మూడు స్థానాలలో కేరళ, అస్సాం, గుజరాత్ లు ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని అన్నారు నాగబాబు.

ఇంకా కిందకి వెళితే చత్తిస్గడ్ జార్ఖండ్ లు ఉన్నాయన్నారు. రోజా ఇలాగే తన బాధ్యతను మరిచిపోయి నోటికి వచ్చినట్లు పిచ్చపిచ్చగా మాట్లాడితే అతి త్వరలో20వ స్థానానికి దిగజారే అవకాశం ఉందన్నారు నాగబాబు. నాగబాబు చేసిన వ్యాఖ్యలకి తాజాగా మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఏదైనా విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలి తప్ప నోటికి ఎంత వస్తే అంత ఫేక్ వార్తలతో దుష్ప్రచారం చేయడం సబబు కాదని హితవు పలికారు.

పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి ఏపీకి ఏం చేశారని రాజకీయంగా తాను ఏనాడు మాట్లాడలేదన్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ విషయం మాట్లాడనని తెలిపారు. మహిళలని గౌరవించడం ఎలాగో ముందు నాగబాబు తెలుసుకోవాలని చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version