బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా

-

ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కూడా వైసీపీ, టీడీపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే.. నిన్న హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చంద్రగిరిలో వీరసింహారెడ్డి సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూశారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఏపీలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను మంత్రి రోజా తప్పుబట్టారు. జగన్ పాలన సజావుగా సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బాలకృష్ణ అనడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు మంత్రి రోజా. బాలకృష్ణ స్క్రిప్టు చూసి ఆ వ్యాఖ్యలు చేశారా లేక తెలియక మాట్లాడారో అర్థం కావడంలేదని మంత్రి రోజా అన్నారు.

జీవో నెం.1ను పూర్తిగా చదివితే బాలకృష్ణ తన వ్యాఖ్యలను తప్పకుండా వెనక్కి తీసుకుంటారని అన్నారు మంత్రి రోజా. ఎమర్జెన్సీ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని, సినిమాల్లో డైలాగులు చెబితే చప్పట్లు కొడతారేమో కానీ, ప్రజల సమస్యలు తీరతాయా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. ఇటీవల 11 మంది చనిపోయినప్పుడు బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని రోజా ప్రశ్నించారు. ఏదేమైనా, తన అల్లుడు, కూతురు బాగుండాలని, బావ కళ్లలో ఆనందం చూడాలని బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినట్టుందని ఆమె విమర్శించారు. ఇటీవల అన్ స్టాపబుల్ షోలో ఎన్టీరామారావుపై జరిగిన చర్చ కూడా స్క్రిప్టు ప్రకారమే జరిగిందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version