శ్రీలంక క్రికెట్ లో కొన్ని దశాబ్దాలు కీలక సభ్యుడుగా ఉంటూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన గ్రేట్ క్రికెటర్ , స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ గురించి అందరికీ తెలిసిందే. క్రికెట్ లో తన అంతర్జాతీయ కెరీర్ లో 800 వికెట్లు తీసుకుని ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డును నెలకొల్పిన మురళీధరన్ బయోపిక్ 800 అన్న పేరుతో ఈ రోజు గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ లో చూస్తున్నంత సేపు కళ్ళల్లో సుడులు తిరిగాయని… ప్రతి ఒక్క సీన్ ను చాలా గ్రిప్పింగ్ గా దర్శకుడు రాసుకున్నాడన్న మంచి స్పదన వస్తోంది. ముఖ్యంగా మురళీధరన్ ఒక క్రికెటర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు అన్న విషయాన్నీ చక్కగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
ఎప్పుడూ క్రికెట్ ను వదిలేసిన మురళీధరన్ కు ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేసుకునే అవకాశం దక్కిందని అందరూ అంటున్నారు. కాగా ఈ సినిమాలో మురళీధరన్ గా నటించింది మధుర్ మిట్టల్ మరియు ఈ సినిమాను తెరకెక్కించిన ఘనత శ్రీపతేకి దక్కుతుంది.