మన ఊరు మనబడి కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫామ్ పై మంత్రి సబితా సమీక్ష

-

మన ఊరు మన బడి, విద్యార్థుల కు యూనిఫాం పై మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి సబిత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే యూనిఫాం అందజేయాలని సూచించారు.

sabita indra reddy

రానున్న విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 25 లక్షల మంది విద్యార్థులకు 121 కోట్ల రూపాయలతో యూనిఫాం లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఒకే రకమైన దుస్తులు ధరించడం ద్వారా వారి మధ్య తారతమ్యాలు, ఎలాంటి కల్మషాలకు తావు లేకుండా ఉండే అవకాశం ఉందన్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో సిద్దంగా ఉంచాలన్నారు.

మన ఊరు – మన బడి కార్యక్రమంలో మొదటి దశలో చేపట్టిన పాఠశాలల్లో 1200 పాఠశాలల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. వీటిలో సి సి కెమెరాలు, ఫర్నీచర్, ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలను డిసెంబర్ 15 నాటికి సిద్ధం చేయాలన్నారు. మిగతా పాఠశాలల్లో కూడా పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version