స్టార్ హీరోయిన్ సమంత ప్రధాని పాత్రలో నటించిన యశోద సినిమా విషయంలో ఇవా అనే పేరు ఎంత వివాదంగా మారిందో తెలిసిందే.. ఈ వివాదంతో ఈ సినిమా ఓటిటిలో విడుదల కాకుండా ఆగిపోయింది.. అయితే ప్రస్తుతం దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు నిర్మాత..
సమంత ప్రధానుపాతం నటిచ్చిన యశోద సినిమాలో ఈవ పేరు వివాదం చివరికి సద్దుమణిగింది.. ఈ సినిమాలోని ‘ఈవా’ అనే పేరుని తొలగించామని, ఓటీటీ, శాటిలైట్ లో ఈ సినిమాని ప్రదర్శించినప్పుడు ‘ఈవా’ అనే పేరు కనిపించదని నిర్మాత స్పష్టమైన హామీ ఇచ్చారు… సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద చిత్రం.. సరోగసి బ్యాక్ డ్రాప్‌తో రూపొందింది.. యశోద సినిమాలో ఇవా హస్పిటల్ పేరు దెబ్బతినేలా చూపించారని ఆ ఆసుపత్రి యాజమాన్యం కోర్టులో పిటిషన్ వేసింది. సినిమాలో అలా చూపించడం వల్ల ఆసుపత్రి పరపతి దెబ్బతిందని అందులో పేర్కొంది. ఈ సినిమా ఓటీటీ విడుదలను ఆపాలని కోరింది. దీంతో కోర్టు యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో తమ ప్రతిష్టకు నష్టం కలిగించే సన్నివేశాలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని, నిర్మాత రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కారు..
అయితే నిర్మాతల జోక్యంతో ఈ విషయం ప్రస్తుతం సద్దుమణిగింది.. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాలో ఈవా అనే పేరు ఒక కాన్సెప్ట్ ప్రకారం పెట్టామని, వేరొకరి మనోభావాలు దెబ్బ తీయడానికి కాదని పేర్కొన్నారు. ఈవా వారిని కలిసి నేను జరిగింది చెప్పానని ఇకమీదట ఫ్యూచర్లో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదని… సినిమాలోని, ఓటీటీ, శాటిలైట్ లో ఈ సినిమాని ప్రదర్శించినప్పుడు ‘ఈవా’ అనే పేరు కనిపించదనిఆయన పేర్కొన్నారు