నటుడు చంద్రమోహన్ కూతుళ్లు అందంగా ఉన్నా సినిమాలోకి రాకపోవడానికి కారణమిదే!

-

క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎన్నో సినిమాల్లో కనిపించే అలరించిన నటుడు చంద్రమోహన్ అయితే ఆయన తన తిన జీవితానికి కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను తాజాగా చెప్పుకొచ్చారు.. ఇందులో ముఖ్యంగా తన కూతుర్లను సినీ రంగానికి తీసుకురాకపోవడానికి అసలు కారణమేంటో వివరించారు..

మన మొదటి తరం హీరోలంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు కానీ వీరితో సరి సమానంగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన మరో హీరో ఉన్నారు. ఆయనే చంద్రమోహన్.
చంద్రమోహన్ సినిమాలకు అప్పట్లో భలే క్రేజ్ ఉండేది. ఆయన నటనలోని వైవిద్యం ప్రేక్షకులను మెప్పించేది. చాలా సినిమాల్లో హీరోగా నటించిన చంద్రమోహన్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. పలు సినిమాల్లో హీరోలకు తండ్రిగా నటించి మెప్పించారు. దాదాపు 175 సినిమాల్లో హీరోగా నటించారు చంద్రమోహన్. మొత్తంగా 900లకు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వయో భారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

త‌న‌కు ఇద్ద‌రు కూతురులు ఉన్నారని.. ఇద్దరమ్మాయిలు చూడటానికి చక్కగా అందంగా ఉంటారని తెలిపారు. అందులో చిన్న కూతురు ఇంకా అందంగా ఉంటార‌ని అన్నారు. చిన్న‌ప్పుడు వాళ్ల‌ను చూసిన న‌టి భానుమ‌తి ఇద్ద‌రూ చాలా అందంగా ఉన్నారని పేర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ప‌రిచ‌యం చేద్దామ‌ని అడిగార‌ని… కానీ తాను దానిని సున్నితంగా తిర‌స్క‌రించాన‌ని చంద్ర‌మోహ‌న్ చెప్పుకొచ్చారు. వాళ్లకు సినిమా షూటింగ్ చూపిస్తే మ‌ళ్లీ ఎప్పుడు తీసుకెళ్తావ్ అని అడుగుతార‌ని భ‌యం వేసేద‌ని.. సినిమాల ప్ర‌భావం వారిపై ప‌డ‌కుండా పెంచాల‌ని అనుకున్నట్లు వెల్లడించారు.. ఇద్ద‌రూ చ‌దువుల్లో బాగా రాణించారని గోల్డ్ మెడ‌లిస్ట్లు అయ్యారని ఆనందం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version