పుష్ప 2 చిత్రంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ హాట్ కామెంట్స్ చేసారు. వీరప్పన్, పూలన్ దేవిల బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు. వీరి బయోపిక్ వల్ల ఏమి నేర్చుకోవాలి అని ప్రశ్నించారు. స్మగ్లర్ల పై కూడా సినిమాలు తీస్తున్నారు , ఐటెం సాంగ్స్ పెట్టి రూ వందలకోట్ల కలెక్షన్లు వచ్చాయని చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఓటీటిలో పుష్ప 2 చిత్రాన్ని చిన్నారులకు చూపిస్తున్నారు అని మంత్రి అన్నారు.
అయితే దీనివల్ల చిన్నారులకు ఏమి చెప్తున్నారు. స్మగ్లర్లలా మారమనా అని ప్రశ్నించారు. ఆదర్శవమైన వ్యక్తులపై బయోపిక్ చిత్రాలు రావాలి అని ఆయన అన్నారు. ఇక తాజాగా జ్యోతి ప్రజ్వలన చేసి సావనిర్ ను ఆవిష్కరించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. ఇందులో గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అధినేత దస్తగిరి రెడ్డి డైరెక్టర్లు మౌలాలి రెడ్డి షేక్షావలి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మంత్రి పుష్ప 2 పై ఈ రకమైన కామెంట్స్ చేసారు.