గీత కార్మికులకు త్వరలోనే ద్విచక్ర వాహనాలను అందిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. గీత కార్మికుల కోసం త్వరలోనే ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభించబోతున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈ స్కీమ్ కింద గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను అందజేస్తామని చెప్పారు. గీత కార్మికులకు చెట్లు ఎక్కడానికి వీలుగా అధునాతన పరికరాలు అందిస్తామని అన్నారు. రంపచోడవరం హార్టికల్చర్ పరిశోధన కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులను తయారు చేస్తామని అన్నారు.

అంతే కాకుండా గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా మంత్రి సవిత చెప్పారు. మంత్రి సవిత షేర్ చేసుకున్న ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గీత కార్మికులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చారని దానివల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని స్పష్టం చేశారు.