ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈనెల 20న జరిగే NDA నేతల భేటీ, 21న ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఈరోజు పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయనుంది. భేటీ అనంతరం అభ్యర్థి పేరును అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా…. ఈనెల 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం 21వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరుతారు.