నాగోబా దర్బార్ లో మంత్రి సీతక్క కీలక కామెంట్స్ చేసారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ఆదివాసీలు సమిష్టిగా ఏకార్యం అయినా పూర్తి చేస్తారు. సమీష్టిగా ఉండడం వల్ల కుటుంబాలు భరోసా ఇస్తది. నాగోబా పూజా విధానం చాలా గొప్పది. వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిద్దాం. పూజించే తీరును మార్చవద్దు. మన రీతులు తీరును మార్చవద్దు. అందరికి మెస్రం వంశీయులు ఆదర్శం.
ఆదిలాబాద్ జిల్లా సమస్యలన్నీ పరిష్కారం చేద్దాం. ఆదివాసీల సంబందాలు ఇంటర్నేషన్ వైడ్ గా ఉంటది. బంధం బందువత్వం సంబందాలు ,మన భాషను కాపాడుకుందాం.. సంప్రదాయ చీరకట్టుపై ,ఆదివాసీల వివాహ వ్యవస్థపై మాట్లాడిన సీతక్క… గోండ్వాన రాజ్యం ఉంది.. రాజరికంగా బతికారు ఇది మాపూర్వీకులు ఇచ్చిన వేషాధారణ. ఆదివాసీల్లో డేటింగ్ లు ఉండవు.. ఆడపిల్ల పెల్లికి పిల్ల వాళ్లు కట్నాలు ఇచ్చే సంప్రదాయం లేదు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు వద్దు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.