మహిళలకు 40 కోట్లకు పైగా చెల్లిస్తున్నాం : మంత్రి సీతక్క

-

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళలకు పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లించాము. ఈ ఏడాదికి సంబంధించి వడ్డీలు మహిళలకు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది అని మంత్రి సీతక్క తెలిపారు. ప్రమాదవశాత్తు మహిళా సంగం సభ్యురాలు మరణిస్తే ప్రమాద బీమా ఇవ్వాలన్న ఆలోచన మీరు చేయలేదు. కానీ నేను మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా పది లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లిస్తున్నాం. ఇప్పటికే 400 మంది మహిళలకు 40 కోట్లకు పైగా చెల్లిస్తున్నాం.

మహిళా సంఘాల పట్ల ఇది మా చిత్తశుద్ధి. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా హరీష్ రావు వ్యవరిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మీ బండారాన్ని బయటపెడతాం. ఎవరు మహిళా సంక్షేమం కోసం కోసం ఎంత చేశారు తేలుస్తాం. మహిళా సంఘాలను పంపించిన మీకు మహిళా సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదు. ప్రజా ప్రభుత్వంలో మహిళలు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. ఒక లక్ష్యం నిర్దేశించుకుని మహిళలను కోటీశ్వరులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆర్థిక చేయుట అందించి మహిళలను ఎన్నో వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నాం. మహిళలకు ఏం చేయడం లేదని రెచ్చగొట్టడమే మీ పని. మహిళల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని సీతక్క అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news