కాంగ్రెస్ అంటేనే ప్రజల సంక్షేమ కోసం పనిచేసే ప్రభుత్వం : మంత్రి సీతక్క

-

ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో కృతజ్ఞత సభలో మంత్రి సీతక్క కీలక కామెంట్స్ చేసారు. పది సంవత్సరాల పోరాటం ఫలితం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కృషితో 5 ఎంపిటిసిలు పది గ్రామపంచాయతీలతో మల్లంపల్లి మండలం ఏర్పాటు అయ్యింది. గత BRS ప్రభుత్వం ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసింది. మల్లంపల్లి ప్రజల ఆకాంక్ష మేరకు నూతన మండలంగా మల్లంపల్లి ని ఏర్పాటు చేశాం.

కెనాల్స్ పాయింట్ ఏర్పాటు చేసి రెండు పంటలకు నీరు అందించే బాధ్యత మాదే. మల్లంపల్లి మండలం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. మల్లంపల్లి లో మార్కెట్ యార్డు త్వరలో ఎంపీ ,రాష్ట్ర నిధులతొ ప్రారంభిస్తాం. గ్రామ సభల్లో లొల్లులు పెట్టుకోకండి.. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదే అన్న మంత్రి… కాంగ్రెస్ అంటేనే ప్రజల ప్రభుత్వం ప్రజల సంక్షేమ కోసం పనిచేసే ప్రభుత్వం. పర్మనెంట్ గా ప్రభుత్వశాఖల కార్యాలయలు ఏర్పాటుకు కృషి చేస్తాం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version