హైదరాబాద్ లో మీర్‌పేట్ హత్య కేసు సంచలంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అవేంటంటే.. ఈకేసులో క్లూస్ కోసం వెతుకుతున్న పోలీసుల టీమ్‌కి 2 కీలక ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది. వాటితోనే ఈ కేసు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు పోలీసులు. ఈకేసులో నిందితుడు అయిన గురుమూర్తి ఇంట్లోని గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యం అయ్యింది.
అయితే ఆ రెండింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది క్లూస్ టీమ్. ఇక గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లిన గురుమూర్తి.. బాత్రూమ్‌లో డెడ్‌బాడీని ముక్కలు ముక్కులుగా కట్ చేసాడు. ఆ తర్వాత ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్ పై పెట్టి కాల్చేసిన గురుమూర్తి.. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగిగా తయారు చేసాడు. ఆ తర్వాత ఆ ఎముకల పొడి మొత్తాన్ని బక్కెట్‌లో నింపి చెరువులో పడేసాడు గురుమూర్తి.