గ్రామ సభల్లో ఇల్లు రాలేదని రేషన్ కార్డు రాలేదని గొడవ చేస్తే తోలు తీస్తా చెట్టుకు కట్టేసి కొడుతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన హెచ్చరికలు వివాదస్పదమయ్యాయి. బీఆర్ఎస్ వాళ్లు కొంత మంది గ్రామసభల్లో ప్రజలను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టించి రగడ సృష్టస్తూ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఆటంకం కల్గిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నేపథ్యంలో సృష్టిస్తున్న వివాదాలతో గ్రామసభల్లో లబ్ధిదారులుగా ఎంపిక కావాల్సిన పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు.
పేదల జీవితాలను ఆగం చేస్తే సహించేది లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఒక్కోటిగా అమలు చేస్తు ముందుకెలుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఇస్తే ఓర్వలేక ఆటోవాళ్లను రెచ్చగొట్టారని, ఇప్పుడు జనవరి 26నుంచి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం సహాయం అందిస్తుంటే ఓర్వలేక గ్రామసభలను అడ్డుకుంటుందన్నారు.