మంత్రి సీతక్క తనలోని టాలెంట్‌ను మరోసారి బయటపెట్టారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో స్త్రీ, శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా సన్న బియ్యం పథకంపై కళాకారుల పాటలు పాడుతుండగా.. పాటకు కోరసిచ్చి మంత్రి సీతక్క చప్పట్లు కొట్టారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారుల పాటలు పాడినట్లు సమాచారం. మంత్రి సీతక్క పాట పాడటంతో స్థానికంగా ఉన్న జనాలు ఫిదా అయిపోయినట్లు తెలిసింది. కాగా, మంత్రి సీతక్క ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో తిరుగుతూ అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.