ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటితో 50 రోజులు పూర్తయినా కనిపించకుండా పోయిన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యం అయ్యాయి. మిగతా ఆరు మంది కార్మికుల ఆచూకీ అంతుచిక్కలేదు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ప్రమాద స్థలం వరకు కన్వేయర్ బెల్ట్, లోకో ట్రైన్‌ను అధికారులు పునరుద్ధరించారు. లోపల స్టీల్, బురద, మట్టి, నీళ్లు, రాళ్లను జేసీబీ సాయంతో అధికారులు తొలగిస్తున్నారు. టన్నెల్ లోపల 30 మీటర్లు డేంజర్ జోన్‌గా అధికారులు నిర్ణయించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ లోతేటి వెల్లడించారు.