ముంపు సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకుని గ్రామస్థులు నిరసన తెలిపారు.ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామంలో శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులను నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆడే గజేంధర్‌తో పాటు నాయకులను దేగామ గ్రామంలో పాత కాలనీవాసులైన ముంపుబాధితులు అడ్డుకున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామంలోని చెరువు నిండి ఇండ్లల్లోకి వరద చేరుతుందని.. మురుగునీరు, దుర్వాసన, పాములు, తేళ్లతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు తమకు వద్దని.. ముంపు సమస్య పరిష్కరించి 130 కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్థులు ఈసందర్భంగా డిమాండ్ చేశారు.
ముంపు సమస్య పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకుని నిరసన తెలిపిన గ్రామస్థులు
గో బ్యాక్ కాంగ్రెస్ అంటూ నిరసన
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులను నిరసన సెగ
మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆడే… pic.twitter.com/9bJRrgWW8P
— Telugu Scribe (@TeluguScribe) April 12, 2025