మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏపీ దిశ యాక్ట్ అసెంబ్లీ ముందుకు వచ్చింది. హౌస్‌లో హోంమంత్రి సుచరిత బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దిశ ఘటన తర్వాత దేశమంతా ప్రకటనలు మాత్రమే చేస్తే.. మహిళ భద్రత కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారని కొనియాడారు. మహిళలపై చేయివేస్తే కఠిన శిక్షలు తప్పవని సుచరిత హెచ్చరించారు. విచారణ గడువు 4నెలల నుంచి 21రోజులకు కుదించినట్లు చెప్పారు.
అన్ని జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధిస్తామని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధింపులకు గురిచేస్తే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. మరియు రాష్ట్రంలోని మహిళలకు భరోసాను కల్పించేలా, ఓ అన్నగా జగనన్న మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ బిల్లని అన్నారు.