అమ్మాయిలకు పాతికేళ్లు వస్తేనే ఆగని ప్రశ్న పెళ్ళెప్పుడు. అయితే కాజల్ అగర్వాల్‌కి వయసు కూడా 35 కి చేరువైంది. దాంతో పెళ్లెప్పుడూ అనే ప్రశ్న ఈమెను కూడా బాగానే వేధిస్తుంది. దానికి సమాధానం చెప్పడానికి కాజల్ కూడా పెద్దగా ఆలోచించడం లేదు. ఇక ఇప్పటికే కాబోయే వరుడు ఎలా ఉండాలి? అతనిలో ఏయే క్వాలిటీస్ ఉండాలి… ఇలాంటి విషయాలపై చందమామ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పెళ్లి కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసింది. దీన్నిపై కాజల్ అగర్వాల్ స్పందించింది.
విజయవాడలో ప్రముఖ షాపింగ్ మాల్‌ను సినీ నటి కాజల్ అగర్వాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. తన పెళ్లిపై వస్తున్న ఉదంతులను నమ్మవద్దని అన్నారు. తన పెళ్లిపై తర్వాత క్లారిటీ ఇస్తానన్నారు. ప్రస్తుతం తాను ఇతర భాషల్లో వస్తున్న సినిమాల్లో బిజీగా ఉన్నానని.. కమల్‌హాసన్‌తో మల్టీ లాంగ్వేజ్ మూవీలో నటిస్తున్నట్లు చెప్పారు. తెలుగులో కథలు వింటున్నానని, నచ్చితే వెంటనే సైన్ చేస్తానని కాజల్ అగర్వాల్ స్పష్టం చేశారు.