తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. పసుపు పంటకు మద్దతు ధర వస్తే రైతులు తలెత్తుకుని తిరుగుతారని అన్నారు. సోమవారం నిజామాబాద్‌లో రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణా రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకు సాటి వచ్చే మరో రాష్ట్రం దేశంలోనే లేదన్నారు. రాష్ట్రానికి పుసుపు పారాణి లాంటి జిల్లా నిజామాబాద్ అని కొనియాడారు.అన్నదాతలకు రూ.2 లక్షల వరకు ఓకే విడతలో రుణమాఫీ చేసి ఘటన తెలంగాణకే దక్కిందన్నారు. కొన్ని కారణాల వల్ల ‘రైతు భరోసా’ అర్ధాంతరంగా నిలిచిపోయిందని చెప్పారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే రైతుభరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.