కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

-

ఇప్పటికే లక్ష రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం…కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నహాలు చేస్తోందని త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేర్వేరుగా ఇస్తామని ఆయన వెల్లడించారు.

కరీంనగర్ బొమ్మకల్ లోని వి -కన్వెన్షన్ లో రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా రైతులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ..గత 10 సంవత్సరాలుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత ఘోరమైన తప్పిదమని, 93 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరంపై గత బీఆర్ఎస్ సర్కార్ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని ఫైర్ అయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు కూడా కాళేశ్వరం తీవ్ర తప్పిదమంటూ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో చెప్పారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news