గ్రూప్ 2 అభ్యర్థులతో సచివాలయంలో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు..ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తామని… డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యా సాధ్యులపై అధికారులతో చర్చిస్తామన్నారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరివారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం భట్టి.
మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని… ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం, ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని… గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవి అంటూ పేర్కొన్నారు. సీఎల్పీ నేతగా నేను, పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే మా పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నాం…. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిది.. ఎన్నికల్లో హామీ ఇచ్చాం మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నారని వివరించారు.