బండి సంజయ్, రేవంత్ కాలిగోటికి కూడా సరిపోరు : వేముల ప్రశాంత్

-

నిజామాబాద్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి హాట్‌ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి , బండి సంజయ్ లు సీఎం కెసిఆర్ కాలిగోటికి కూడా సరిపోరని నిప్పులు చెరిగారు. అసత్యపు అరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని…. దమ్ము, దైర్యం ఉంటె రెవంత్ రెడ్డి… కెటిఆర్ విసిరిన సవాలు స్వీకరించాలని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీతో కలిసి డిల్లీ ఎయిమ్స్ కి రావాలని రేవంత్‌ కు సవాల్‌ విసిరారు. జైలుకు వెళ్ళి వచ్చినాక రేవంత్ మతి భ్రబించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ పార్టీ అధ్యక్షునిగా ఉండి కుడా స్థాయి మరిచి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కెసిఆర్ ని జైలు కు పంపుతామని మూడేళ్ల నుండి అంటున్న బండి సంజయ్ ఇప్పటి వరకు ఎలాంటి అరోపణలు నిరూపించ లేకపోయారని చురకలు అంటించారు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లో ప్రతి పక్ష పార్టీలు ఉండి ప్రయోజనం లేదన్నారు ప్రశాంత్‌ రెడ్డి..

Read more RELATED
Recommended to you

Exit mobile version