కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ దూకుడు గానే వెళ్తూ ఉంటారు. అయితే కొన్ని నిర్ణయాల విషయంలో జగన్ చేస్తున్న తప్పులు పార్టీలో సమస్యలకు దారితీస్తున్నాయి అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. కొన్ని నిర్ణయాల విషయంలో జగన్ ఈ మధ్యకాలంలో ఎవరి సలహాలు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొంత మంది ఇచ్చే సలహాలను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందుకే కొంత మంది మంత్రులు కూడా ఇప్పుడు జగన్ సలహాలు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువగా అనుభవం ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు వైసీపీలో ఎక్కువగానే ఉన్నారు. మాజీ మంత్రులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందుకే జగన్ శ్రేయోభిలాషులు కూడా వాళ్ళు జగన్ కు బలంగా ఉంటారు అని భావించారు.
కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరూ కూడా జగన్ కు బలంగా కనపడటం లేదనే అభిప్రాయం ఉంది. కొంతమంది పార్టీ వ్యవహారాలలో కూడా పెద్దగా తలదూర్చడం లేదు. కొంతమంది వద్ద నుంచి ప్రాధాన్యత లేకపోవడంతో వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అయితే జగన్ కు సలహాలు ఇవ్వాలని భావించిన జగన్ సలహాలు తీసుకోవడం లేదని క్యాబినెట్ సమావేశంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా కొంతమంది మంత్రులకు లేదు అని కొంతమంది అంటున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది మంత్రులు జగన్ కు సలహాలు ఇవ్వటం కంటే సైలెంట్ గా ఉండడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.