మంత్రులకు కమీషన్ల దందాలు ఎక్కువ అయ్యాయని బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. 15 నెలల్లో ఏ కాంట్రాక్టర్‌కు ఎంత ఇచ్చారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లోటు బడ్జెట్ ఉన్నా కాంట్రాక్టర్ల జేబులు నింపారని ఆరోపణలు చేశారు.
కానీ, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని విమర్శలు చేశారు. మంత్రులు ఫోటోలకు ఫోజులివ్వడం తప్ప చేసేదేమి లేదని ఘాటువ్యాఖ్యలు చేశారు. బాధితులు ఇతర రాష్ట్రాలు వారని మంత్రులు లైట్ తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేతకానితనం వల్లే ఎస్ఎల్‌బీసీ ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు.