ఆర్టీసీ బస్సులో మగవాళ్లకు ఫ్రీ టికెట్ ఇచ్చిన కండక్టర్ !

-

మహాలక్ష్మి టికెట్ ఇవ్వడంలో పెద్ద తప్పిదమే చేశాడు ఆర్టీసీ కండక్టర్‌. ఆర్టీసీ బస్సులో మగవాళ్లకు ఫ్రీ టికెట్(మహాలక్ష్మి టికెట్) ఇచ్చాడు కండక్టర్. ఫ్రీ బస్సు పథకాన్ని అదునుగా తీసుకొని ఆర్టీసీ కండక్టర్ల నయా దందా చేశారని ప్రచారం జరుగుతోంది.

RTCConductor gives Mahalakshmi ticket to men in RTC bus

ఈసీఐఎల్ నుండి అఫ్జల్‌గంజ్ వెళ్తున్న ఒక బస్సు(TS02Z0267)లో ఎక్కిన యువకుడు కండక్టర్‌ను టికెట్ అడగగా.. మహాలక్ష్మి (మహిళలకు ఫ్రీ బస్సు) టికెట్ ఇచ్చి రూ.30 వసూల్ చేశాడు కండక్టర్. ఇదేంటి అని అడిగిన ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించి.. టికెట్ ఇచ్చే మెషిన్ సరిగ్గా పనిచేయట్లేదని సమాధానం ఇచ్చాడు కండక్టర్. దీంతో ఈ సంఘటన వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news