భారత్, పాక్ మధ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా ఛానల్స్‌కు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ శుక్రవారం ఉదయం కీలక విజ్ఞప్తి చేసింది. మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు భద్రతా దళాలకు చెందిన రక్షణ కార్యకలాపాలు, కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆపాలని సూచించింది.
ఆర్మీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల భద్రతా దళాల ఆపరేషన్స్‌కు మరియు వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ సందర్భంగా ప్రకటించింది. అయితే, ఇండియన్ ఆర్మీకి సంబంధించినన సమాచారం మీడియా, సోషల్ మీడియాలో కనిపిస్తే పాక్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది.
మీడియా ఛానల్స్‌కు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విజ్ఞప్తి
మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు భద్రతా దళాలకు చెందిన రక్షణ కార్యకలాపాలు, కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆపాలని సూచించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
అలాంటి సున్నితమైన సమాచారాన్ని… pic.twitter.com/MjrbH2GOLU
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2025