తెలంగాణలో దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం..

-

రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతోంది. కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కామవాంఛ తీర్చుకోవడానికి మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. అన్యం పుణ్యం తెలియని చిన్నారిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి చిన్నారి ఏడుస్తూ కనిపించడంతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిధిలో నివసించే తొమ్మిదేళ్ల బాలికపై 44 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

సదరు బాలిక కుటుంబసభ్యులు ఉపాధి పని నిమిత్తం వెళ్లగా బాలిక ఇంటివద్దనే ఉంది. బాలికను ఒంటరిగా గమనించిన పక్కింట్లో నివసించే రమేష్.. భోజనం పెడతానని చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి నిందితుడు పరారయ్యాడు. ఘటనతో భయాందోళను గురైన బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి తమ కూతురు ఏడుస్తూ కనిపించడంతో విషయం తెలుసుకుని హుటాహుటిన చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version