జీడిపప్పును ఈ సమస్య ఉన్నవారు అసలు తినకూడదట..!

-

జీడిపప్పు అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరేమో కదా..కాస్త కాస్ట్ ఎక్కువైనా వంటల్లో వాడితే ఆ టేస్టే వేరు. జీడిపప్పు తీయగా.. రుచిగా ఉంటుంది. దీన్ని పోషకాహారం కోసం లేదా డైట్ చేసేటప్పుడు తింటారు. దీనివల్ల శక్తి పెరుగుతుంది. ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్న జీడిపప్పును అందరూ తినకూడదట. కొంతమంది అస్సలు ముట్టుకోకూడదుట. ఇంతకి ఎవరూ జీడిపప్పుకు దూరంగా ఉండాలో చూద్దాం.

ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:

జీడిపప్పు ఎక్కువగా తినడం వల్ల లేదా అలర్జీ ఉన్నవారికి మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.
ఎక్కువ మొత్తంలో జీడిపప్పు తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
మలబద్ధకం సమస్య వస్తుంది.
ఎక్కువ మొత్తంలో జీడిపప్పు తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
జీడిపప్పులో ఆక్సలేట్ గుణాలు ఎక్కువ. జీడిపప్పులు టైరమైన్, ఫెనిలేథైలమైన్ వంటి విషపూరితమైన అమైనో ఆమ్లాలు సెన్సిటివ్ గా ఉన్నవారికి తలనొప్పిని కలిగిస్తుందట

మితంగా జీడిపప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం మొదలైన వాటికి జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది.

కణాల నష్టం..

సాధారణంగా జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్ ను నివారించడంలో సహాయపడతాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వాపును తగ్గిస్తుంది. మామూలు జీడిపప్పు కంటే వేయించిన జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి

బరువు తగ్గడానికి మంచిది..

ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా జీడిపప్పులో ఉంటుంది. అనోరెక్సియాని కలిగించడం ద్వారా శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. అంతేకాదు, కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. జీడిపప్పు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు ఆహారంలో చేర్చుకోవడం వల్ల హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

గుండెకు మంచిది..

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వారానికి నాలుగుసార్ల కంటే ఎక్కువ జీడిపప్పు తినే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 37 శాతం తక్కువగా ఉంటుంది.

ఏంటి తినొద్దంటారు..తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు. కన్ఫూస్ చేస్తున్నారు అనుకుంటున్నారా..అలా కాదండి..ఎక్కువ తింటే పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మితంగా తింటే ఎలాంటి సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version