ఇంట్లో ఎవరూ లేని సమయంలో తొమ్మిదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గడం లేదు. వావి వరసలు మరిచి, పసిపిల్లలు అని కూడా చూడకుండా చిన్నారులపైనా అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొందరు కామాంధులు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు మీదపడి మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై స్థానికంగా ఉండే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బిహార్​కు చెందిన దేవదాస్​ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం బాలిక తల్లిదండ్రులు ఓ పరిశ్రమలో విధులకు వెళ్లిన సమయంలో ఇంటి పక్కనే ఉన్న దేవదాస్ అనే యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
అతడి బెదిరింపులకు భయపడిన బాలిక ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version