సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.
వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను రద్దు చేసి… దానిని MSJEGOIలో విలీనం చేస్తుందని డెక్కన్ హెరాల్డ్ ప్రచురించినట్టు వార్త వచ్చింది. అయితే మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.
A media report published in @DeccanHerald is claiming that the Central government is likely to scrap the Ministry of Minority Affairs and will merge it with @MSJEGOI#PIBFactCheck
▶️ This Claim is #FAKE
▶️ No such Proposal is under consideration pic.twitter.com/RcTtyzyw59
— PIB Fact Check (@PIBFactCheck) October 3, 2022
కేంద్ర ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను రద్దు చేసి… దానిని MSJEGOIలో విలీనం చేస్తుందని వచ్చిన వార్త నిజం కాదు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. కనుక ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మకండి. ఇతరులకి పంపకండి.