సాయంత్రం పూట ఐదే నిమిషాల్లో ”మింటీ ఫాక్స్ నట్స్” చేసుకోండి.. ఆకలి ఉండదు.. ఆరోగ్యము కూడా..!

-

సాయంత్రం పూట ఆకలి ఎక్కువగా వేస్తుందా.. ఏదైనా ఆరోగ్యకరమైన స్నాక్స్ ని తయారు చేసుకోవాలని చూస్తున్నారా..? అయితే వీటిని మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే వీటిని మీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా కేవలం ఐదే నిమిషాల్లోనే వీటిని తయారు చేసుకో వచ్చు మరి ఇక రెసిపీ గురించి కావాల్సిన పదార్థాలు వివరాలు చూసేద్దాం…

మింటీ ఫాక్స్ నట్స్ కి కావలసిన పదార్దాలు:

20 గ్రా ఫాక్స్‌నట్స్/ మఖానా
20 ml నెయ్యి లేదా నూనె
చాట్ మసాలా పౌడర్
5 గ్రాములు పుదీనా పొడి

మింటీ ఫాక్స్ నట్స్ ని తయారు చేసే విధానం:

ఇక ఎలా తయారు చేసే విధానం చూస్తే.. దీని కోసం ముందు మీరు పాన్‌ లో నెయ్యి వేసి వేడి చేసి ఆ తరవాత మఖానా వేసి 2-3 నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి.
ఆ తరవాత మళ్లీ అదే పాన్ మధ్య లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి… పొడి పుదీనా పొడి, చాట్ మసాలా పొడి వేసి ఆ తరవాత ఫాక్స్‌నట్‌లను కూడా వేసి బాగా కలపాలి. ఓ నిమిషం ఇలా వీటిని అన్నింటినీ ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version