ఎవరెన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ విజయాన్ని ఆపలేరు – మంత్రి ఎర్రబెల్లి

-

ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నేడు బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా మంగళవారం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో పలు వార్డులకు సంబంధించి పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికలలో బిఆర్ఎస్ తిరిగి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే అంశాన్ని సర్వేలన్నీ తేల్చి చెబుతున్నాయని.. పాలకుర్తి నియోజకవర్గంలో కూడా తాను 80 వేల మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వ్యక్తులు అబద్దాలతో ప్రజలని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. వారి మాటలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version